![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -664 లో... కావ్యని రాజ్ బూత్ బంగ్లాకి తీసుకొని వెళ్తాడు. కావ్యని కళ్ళుమూసుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. కావ్య కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ బాగా డెకరేషన్ చేసి ఉంటుంది. అది చూసి కావ్య సర్ ప్రైజ్ అవుతుంది. ఇన్ని రోజులు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కష్టంలో నాకు తోడుగా ఉన్నావ్.. ఫ్రెండ్ గా సలహా ఇచ్చావ్.. నీపై నాకు ప్రేమ ఉంది.. అది చెప్తే నువ్వు నాతో గొడవ పడడం ఆపేస్తావేమోనని చెప్పలేదు.. నువ్వు నాతో గొడవ పడితే నాకు నచ్చుతుందని రాజ్ అంటాడు. దాంతో కావ్య మురిసిపోతుంది. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని కావ్యకి రింగ్ పెట్టి రాజ్ ప్రపోజ్ చెయ్యగానే కావ్య ఎమోషనల్ అయి హగ్ చేసుకుంటుంది.
మీరు నన్ను విడిచినా.. నేను నిన్ను విడవనని కావ్య అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయల్దేరి వెళ్ళిపోతారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. మరొక వైపు యామిని రౌడీకి ఫోన్ చేసి ఎక్కడివరకు వచ్చిందని అనగానే పని పూర్తవుతుందని ఆ రౌడీ చెప్తాడు. రాజ్, కావ్య వెళ్తుంటే కొండపై నుండి రౌడి షూట్ చేస్తాడు. అది టైర్ కి తాకి కార్ లోయలో పడిపోతుంది. మరొకవైపు కావ్య రాజ్ ల ఫోటో కిందపడిపోతుంది. అది చూసి అపర్ణ కంగారు పడుతుంది. మొదటిసారి ఇద్దరు బయటకు వెళ్లారు.. ఇలా జరిగింది ఏంటని అపర్ణ టెన్షన్ పడుతుంది. ఫోన్ చేయబోతుంటే వాళ్లని డిస్టబ్ చెయ్యకని సుభాష్ అంటాడు. అప్పుడే సుభాష్ కి ఫోన్ వస్తుంది రాజ్, కావ్యలకి ఆక్సిడెంట్ అయిందని సుభాష్ కి ఫోన్ రావడంతో అది విని అందరు షాక్ అవుతారు. యామినికి రౌడీ ఫోన్ చేసి బుల్లెట్ మిస్ అయి టైర్ కి తగిలిందని చెప్తాడు.
అపర్ణ వాళ్ళు హాస్పిటల్ కి వస్తారు. కావ్య ఉన్న సిచువేషన్ చూసి అపర్ణ బాధపడుతుంది. కనకం కూడా వస్తుంది. డాక్టర్ వచ్చి బ్లడ్ ఎక్కించాలని చెప్తాడు. మా అబ్బాయి రాజ్ ఎక్కడ అని సుభాష్ అడుగగా.. ఏం తెలియదు ఒక్క ఆవిడనే అడ్మిట్ చేశారు.. పోలీసులు బయట ఉన్నారు.. అడగండి అని డాక్టర్ అనగానే అప్పు వెళ్తుంది. రాహుల్, రుద్రాణి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో కావ్య స్పృహ లోకి వస్తుంది. రాజ్ గురించి అడుగుతుంది అప్పు వచ్చి పోలీసులకి కూడా బావ గురించి తెలియదట కానీ అక్కడ చెట్టుకి ఈ షర్ట్ దొరికిందట అని అప్పు చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |